Yamuna Thatilo is a very popular song from the movie Dalapathi (1991), starring Rajinikanth, Mummotty, Shobhana, and Aravind Swamy. This song was penned by Veturi and sung by Swarnalatha. Get Yamuna Thatilo Song Lyrics in Telugu here.
Yamuna Thatilo Song Lyrics in Telugu – యమునా తటిలో నల్లనయ్యకై
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా ….
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా