Skip to content

Deva Devam Bhaje Lyrics in Telugu – దేవ దేవం భజే దివ్య ప్రభావం

    Deva Devam Bhaje Song Lyrics from Attarintiki Daredi Movie

    Deva Devam Bhaje is a popular song from the movie Atharintiki Daaredi (2013) starring Pawan Kalyan, Samantha, Pranitha Subhash, etc. This song is a modified version of the Annamayya Keerthana Deva Devam Baje. Get Deva Devam Bhaje Lyrics in Telugu here.

    Deva Devam Bhaje Song Lyrics in Telugu – దేవ దేవం భజే దివ్య ప్రభావం 

    దేవ దేవం భజే దివ్య ప్రభావం
    రావణాసుర వైరి రణపుంగవం
    రామం.. దేవ దేవం భజే దివ్య ప్రభావం

    ఆ ఆ ఆ….
    వేల సుమ గంధముల గాలి అలలా
    కలల చిరునవ్వులతొ కదిలినాడు
    రాల హృదయాల తడిమేటి తడిలా
    కరుణగల వరుణుడై కరిగినాడూ
    అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
    ఆవిరి మేఘాలె ఆతడి సొంతం
    అరమరికల వైరం కాల్చెడి అంగారం
    వెలుగుల వైభోగం ఆతని నయనం
    ప్రాణ ఋణ బంధముల తరువును
    పుడమిగ నిలుపుటె తన గుణం

    దేవ దేవం భజే దివ్య ప్రభావం
    రావణాసుర వైరి రణపుంగవం
    రామం.. దేవ దేవం భజే దివ్య ప్రభావం

    ఆ ఆ ఆ….
    కనుల తుది అంచునొక నీటి మెరుపూ..
    కలలు కలగన్న నిజమైన గెలుపూ..
    పెదవి తుది అంచునొక తీపి పిలుపూ..
    సెగల ఏడబాటుకది మేలి మలుపూ..
    భళ్ళున తెల్లారే తళ తళ తూరుపులా
    వెలుగులు కురిసిందీ ఈ ఆనందం..
    ఋతువులు గడిదాటే చెరగని చైత్రములా
    నవ్వులు పూసిందీ ఈ ఆనందం..
    జీవమదె మాధురిగ మమతలు
    చిలికెను మనసను మధువనం.

    దేవ దేవం భజే దివ్య ప్రభావం
    దేవ దేవం భజే దివ్య ప్రభావం
    రావణాసుర వైరి రణపుంగవం
    రామం.. దేవ దేవం భజే దివ్య ప్రభావం

    స్పందించండి

    మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి